A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రామోజీ- దృతరాష్ట్రుడి లా కళ్లుమూసుకోవద్దు
Share |
August 15 2020, 1:20 am

కరోనా క్లిష్ట సమయంలో ఎపి ప్రభుత్వంపై మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు. ఈనాడు పత్రిక తెలంగాణలో కరోనా గురించి భయపడవద్దని రాస్తూ, ఎపిలో మాత్రం కరోనా కల్లోలం అని రాయడంపై ఆయన స్పందించారు. ఈనాడు అదినేత రామోజీరావు వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు.రామోజీ ధృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకోవద్దని శ్రీకాంతరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్‌ పాలన చూసి టీడీపీ నేతలు ఈర్ష్య పడుతున్నారని విమర్శించారు.పరిపాలనలో పేదలకు సహాయం చేయాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని ఆచరణలో చూపిస్తున్నారని ఆయన అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజల శ్రేయస్సు కోసం ఆరు నెలల్లోనే రూ.28,122 కోట్లు ఖర్చు చేశామని, కులం, మతం, పార్టీ కూడా చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.

tags : ramoji

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info