A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అడవులతోనే పకృతి సమతుల్యత
Share |
August 15 2020, 1:22 am

అడవులతోనే ప్రకృతి సమతుల్యత సాధ్యమని, రాష్ట్రంలో అట‌వీ ప్రాంతాన్ని పెంచడానికే సీఎం కేసీఆర్‌
హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
అన్నారు. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా మెగా ప్లాంటేషన్ డేలో పాల్గొని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మొక్క‌లు నాటారు.
బుధ‌వారం మావల హరితవనం నుంచి చాందా-టీ వరకు రోడ్లకు ఇరువైపులా ఒకే రోజు లక్ష మొక్కలు నాటారు. అనంత‌రం
ఎమ్మెల్యేలు జోగు రామ‌న్న‌, రాథోడ్ బాపురావు, క‌లెక్ట‌ర్ దేవ‌సేన‌తో మావ‌ల హ‌రిత‌వ‌నంలో పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని
మంత్రి ప్రారంభించారు. హ‌రిత‌వ‌నంలో మొక్క‌లు నాట‌డంతో పాటు విత్త‌నాలు చ‌ల్లారు. స‌ఫారి వాహ‌నంలో హ‌రిత‌వ‌నంలో
కాసేపు ప‌ర్యాటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... అడ‌వుల ర‌క్ష‌ణ‌కు, అడవులను పునురుద్ధరించడానికి
సీయం ప్రత్యేకంగా దృష్టిసారించారన్నారు. గ‌త ఐదు విడ‌త‌ల్లో హ‌రితహారం కార్య‌క్ర‌మంలో భాగంగా నాటిన మొక్క‌ల్లో 70%
బ‌తికాయ‌ని, పంచాయ‌తీరాజ్, మున్సిప‌ల్ చ‌ట్టం ప్ర‌కారం నాటిన మొక్క‌ల్లో 85% స‌ర్వైవ‌ల్ అయ్యేలా చూసే బాధ్య‌త స్థానిక
ప్ర‌జాప్ర‌తినిదులు, అధికారుల‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ఏడాది 30 కోట్ల మొక్క‌లు నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని
తెలిపారు.ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నా రు. అడ‌వుల ర‌క్ష‌ణ‌పై
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా దృష్టి సారించిద‌ని, కలప స్మగర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడమే కాకుండా
కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ క్షేత్రాల రక్షణ మనందరి బాధ్యత అని, కలప అక్రమ రవాణాకు సంబంధించి
అధికారులకు సమాచారం అందివ్వాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జోగు రామన్న,
రాథోడ్ బాపురావు, క‌లెక్ట‌ర్ దేవ‌సేన‌, సీఎఫ్ వినోద్ కుమార్, డీఎఫ్ వో, ఇత‌ర అట‌వీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

tags : indrakaran

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info