A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతుబంధు కేసీఆర్ మానసపత్రిక
Share |
August 15 2020, 2:14 am

రైతుబంధు పంపిణీపై వనపర్తిలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రైతుబంధు కేసీఆర్ గారి మానసపత్రిక
- ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిశానిర్దేశంలో వ్యవసాయ శాఖ రైతుబంధు నిధులను దాదాపు ఏడువేల కోట్ల రూపాయలు
విజయవంతంగా పంపిణీ చేసింది
- రైతులకు కులం లేదు, మతం లేదు .. రైతులదంతా ఒకే కులం .. సేద్యపు కులం అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి
సందేశం .. వారందరికీ రైతుబంధు సాయం అందాలి
- రైతుబంధు నిధుల పంపిణీ ఒక ప్రపంచ రికార్డు .. 36 గంటలలో రికార్డు ఖాతాలలో డబ్బులు వేశాం .. ప్రపంచంలో ఎక్కడా
ఇలాంటి పథకం లేదు .. ఇంత సానుకూల విధానం లేదు
- వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్న ఆకాంక్షతో అమలు చేస్తున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే
- రైతుబంధు, రైతుభీమా వంటి ప్రభుత్వ సానుకూల విధానాలతో తెలంగాణ రైతుల ఆత్మవిశ్వాసం
- ప్రతి రైతుకు రైతుబంధు అందాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష
- ప్రతి రైతు తన ఖాతా, పాస్ బుక్ వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద సరిచేసుకోవాలి
- రైతుబంధు పథకం కింద ఈ ఏడాది వానకాలం సీజన్ కు గాను 55.06 లక్షల రైతులకు చెందిన కోటీ 39 లక్షల 76 వేల
ఎకరాలకు గాను రూ.6987.90 కోట్లు ఖాతాలలో వేయడం జరిగింది
- ఈ వారంలో 1.96 లక్షల మంది రైతులు బ్యాంకు వివరాలు నమోదు చేసుకేవడం జరిగింది. దీనికి సంబంధించిన
రూ.214.75 కోట్లు త్వరలోనే జమచేయబడతాయి

- ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు జులై 5 వరకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు వివరాలు
నమోదు చేయించు కోవాలి
- 28 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సరిగ్గా లేవు. వారికి డబ్బులు జమచేసినా వారి ఖాతాలకు చేరలేదు.
ఐఎఫ్ఎస్ సి కోడ్ గానీ, మూసివేయబడిన ఖాతాలు ఇవ్వడం లేదా సరయిన ఖాతా నంబరు ఇవ్వక పోవడం వల్ల నిధులు
జమకాలేదు
.. వారు వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి తమ ఖాతాలు సరిచేయించుకోగలరు
- 11 వేల మంది రైతుల బ్యాంక్ పాస్ బుక్ పేరు, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ లలో పేర్లలో వ్యత్యాసం ఉన్నందున
సరిదిద్దేందుకు ఆదేశించడం జరిగింది. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి సరిచేయించుకోగలరు

- వ్యవసాయ శాఖాధికారులకు విజ్ఞప్తి .. రైతుబంధు నిధులు రైతులకు చేర్చాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదే

tags : niranjanreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info