A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా- మెడికల్ కాలేజీలకు మరింత బాద్యత
Share |
July 3 2020, 6:57 pm

కోవిడ్-19 పై పోరాటంలో మెడికల్ కాలేజీలపై మరింత బాధ్యత ఉంది: గవర్నర్
మరిన్ని అవగాహనా సదస్సులు నిర్వహించి ప్రజలను కోవిడ్-19 పై పోరాటంలో బాగస్వాములను చేయాలని ఆ విధంగా
కరోనా వైరస్ ప్రభలకుండా చూడాలని కాళోజీ నారాయణకావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అధికారులకు గవర్నర్
డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.
మెడికల్ కాలేజీలు తమ పరిధిలో ప్రజలకు చేరువై పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు నిర్వహించి వైరస్ నివారణలో
వారిని పాల్గొనేలా ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు.
గవర్నర్ ఈరోజు రాజ్ భవన్ నుండి విడియో కాన్ఫరెన్స్ ద్వారా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్
అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ పై పోరాటంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది
విశేషమైన కృషి చేస్తున్నారని వారిని సరిగా చూసుకోవడం మన బాధ్యత అన్నారు. వైద్యులు, సిబ్బంది మానసిక స్ధైర్యాన్ని
పెంపొందిస్తూ వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని యూనివర్సిటీ అధికారులకు సూచించారు.
నాలుగు కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో కేవలం 4,790 యం.బి.బి.యస్ సీట్లు మాత్రమే ఉన్నాయని ఈ సీట్ల సంఖ్యను
పెంపొందించడానికి తగిన అనుమతుల కోసం కృషి చేయాలని, దీని ద్వారా వైద్య విద్యార్ధుల సంఖ్య పెంచాల్సిన ఆవశ్యకత
ఉందన్నారు.
కోవిడ్ వంటి వైరల్ సమస్యలపై మరింత విస్తృత పరిశోధనలను ప్రోత్సహించాలని, ఆ డేటాబేస్ తయారు చేసుకొని అందరికీ
అందుబాటులోనికి తేవాలని డా. తమిళిసై సూచించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత విద్యలో ముఖ్యంగా వైద్య విద్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖంగా నిలుపడానికి
అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.
కాళోజీ నారాయణకావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్స్ లర్ ప్రో. కరుణాకర్ రెడ్డి, రిజిస్ట్రార్, ఇతర అధికారులతో
గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రటరీ కె. సురేంధ్రమోహన్, సంయుక్త కార్యదర్శులు జె. భవానీ శంకర్, సి.యన్. రఘుప్రసాద్,
అనుసంధాన అధికారి సి.హెచ్. సీతారాములు, డా. కె. రాజారాం పాల్గొన్నారు.

tags : tamil sai

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info