A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చైనా యాప్ లు నిషేధించడం వల్ల...
Share |
July 3 2020, 6:54 pm

చైనా యాప్ లను కేంద్ర ప్రబుత్వం నిషేధించినా, అవి ఎంత వరకు దేశంలో వినియోగంలో లేకుండా పోతాయన్న చర్చ జరుగుతోంది.దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కారు ప్రకటించింది. అయితే ప్రకటనలో చైనా పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం విశేషం. దాదాపు ఈ యాప్‌లన్నీ చైనాకు చెందినవే. బాగా పాపులర్‌ అయిన టిక్‌టాక్, హెలో, యూసీ బ్రౌజర్, న్యూస్‌ డాగ్‌ వంటి యాప్‌లు సహా మొత్తం 59 యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్‌ యాప్‌లు భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు మన దేశ వినియోగదారుల డేటాను అనధికారికంగా చేరవేస్తున్నట్లు, రహస్యంగా, దొంగతనంగా డేటాను పంపిస్తున్నట్టు ఐటీ శాఖకు అనేక ఫిర్యాదులు అందాయి. ఇది చాలా ఆందోళన కలి గించే విషయమైనందున అత్యవసర చర్యలు చేపట్టినట్టు కేంద్రం వెల్లడించింది. చైనా యాప్‌లపై నిషేధం విధించడంతో భారతీయ యాప్‌ మార్కెట్‌ విస్తరించే అవకాశం ఉంది. టిక్‌టాక్‌ వంటి యాప్‌లకు పోటీగా ఇప్పటికే చింగారీ వంటి స్వదేశీ యాప్‌ నిలదొక్కుకుంటోంది. అలాగే న్యూస్‌డాగ్, హెలో వంటి న్యూస్‌ అగ్రిగేటర్లకు దీటైన స్వదేశీ యాప్స్‌ నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. చైనా దుందుడుకు చర్యలకు తగిన సమాధానంగానే యాప్‌లపై నిషేధం విధించినట్లు అవగతమవుతోంది. కాగా ఇప్పటికే చైనా తయారీ మొబైల్స్‌ భారత్‌లో అత్యధికంగా వినియోగంలో ఉన్నాయి. ఈ నిషేధిత యాప్‌ల్లో చాలా వరకు మొబైల్‌ ఫోన్లలోనే ఇన్‌బిల్ట్‌గా నిర్మితమై ఉన్నాయి. వాటిని తొలగించేందుకు అవకాశం లేదు. కేంద్రం నిషేధించినప్పటికీ కొత్తగా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోకపోయినా పాత యాప్‌లు వినియోగంలో ఉంటాయని సంబంధిత కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని మీడియాలో కదనాలు వచ్చాయి. మరి ఎంతవరకు యాప్ ల నిషేదం పనిచేస్తుందన్నది చర్చనీయాంశంగా ఉంది.

tags : center

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info