A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పీవీని చూస్తూనే నేను నేర్చుకున్నా-మంత్రి
Share |
July 3 2020, 8:08 pm

భారత పూర్వ ప్రధాని, దివంగ‌త పీవీ న‌ర్సింహారావు అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన ప్ర‌ధాన మంత్రి, ఆయ‌న తీసుకున్న
సాహ‌సోపేత నిర్ణ‌యాలు, ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు మ‌న దేశానికే దిశానిర్దేశం అయ్యాయ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్,
గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ప‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. పీవీ నరసింహారావు శత
జయంతి ఉత్సవాల్లో భాగంగా హన్మకొండ బస్టాండ్ కూడలి వద్ద గల పీవీ విగ్రహానికి పూల మాల వేసి నివాళుల‌ర్పించారు.
అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ఒంట‌బ‌ట్టించుకుని, భార‌తీయ భాష‌ల‌న్నింటినీ
అవ‌పోస‌న ప‌ట్టిన పీవీ, అత్యంత మేధావి అన్నారు.
పీవీ చ‌దువు, సాహిత్యం, జీవ‌నం, రాజ‌కీయ జీవితం కూడా వ‌రంగ‌ల్ నుంచే మొద‌ల‌య్యాయ‌న్నారు. అనంత‌రం

ప్ర‌జాప్ర‌తినిధిగా, సిఎంగా తీసుకున్న భూ సంస్క‌ర‌ణ‌లు, అత్యంత క్లిష్ట‌, క‌ష్ట స‌మ‌యంలో ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్టి, ఆర్థిక
సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌డం వంటి అనేక నిర్ణ‌యాలు ఆయ‌న సాహ‌సాల‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు.
తొలి తెలుగు ప్రధాని పీవీ నర్సింహారావు తెలంగాణ పేరును ప్రపంచ నలుమూలల వ్యాపింప చేసిన వ్యక్తి అన్నారు. పి వి
సాహసోపేతంగా చేసిన ఆర్థిక సంస్కరణల వల్లనే ప్రస్తుతం దేశం అభివృద్ధిలో పురోగమిస్తోంది. ఆయ‌న భారతీయ సంస్కృతికి
నిలువుటద్దం. భారతీయ భాషల్ని అవపోసన పట్టిన మేధావి. దేశంలో అనేక అగ్ర పదవులు నిర్వహించిన అపర
చాణ‌క్యుడ‌ని పేర్కొన్నారు. ఆయన మన హన్మకొండ ఎంపీ గా కూడా ఉన్నారంటూ, పీవీతో త‌మ కుటుంబానికి ఆత్మీయ
అనుబంధం ఉంద‌న్నారు. తాను, క‌డియం శ్రీ‌హ‌రి తో క‌లిసి పీవీ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ఢిల్లీలో క‌లిశామ‌ని, అప్పుడు
కూడా త‌మ తండ్రి, కుటుంబం గురించి ఆరా తీశార‌న్నారు. త‌న తండ్రికి రాజ‌కీయాలు అచ్చిరాలేద‌ని, అందుకే ఆయ‌న
స‌ర్పంచ్ గానే మిగిలిపోయార‌ని త‌న‌కు చెప్పార‌ని మంత్రి గుర్తు చేసుకున్నారు. దాంతో తాను ప‌ట్టుద‌ల‌గా రాజీకీయాల‌లో
 పీవీని ఆద‌ర్శంగా తీసుకుని, ఎదిగాన‌ని చెప్పారు. పీవీ జీవితం అందరికీ ఆదర్శం అన్నారు.పి వి మన తెలంగాణ బిడ్డ
కావడం మనకు గర్వకారణం అని చెప్పారు.
శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం తరుఫున ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి నా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పీవీ త‌ర‌హా సాహ‌సోపేత నిర్ణ‌యాల‌తోనే సీఎం కెసిఆర్ ప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని
మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. పీవీ శత జయంతి ఉత్సవాలను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా
కలెక్టర్లను ఆదేశించారు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ లు కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు, ప‌సునూరి ద‌యాక‌ర్,
బండా ప్ర‌కాశ్, మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్,
అరూరి ర‌మేశ్, కుడా చైర్మ‌న్ మ‌ర్రి యాద‌వ‌రెడ్డి,మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, వ‌రంగ‌ల్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ చింత
స‌దానందం, కేతిరెడ్డి వాసుదేవ‌రెడ్డి, ఇండ్ల నాగేశ్వ‌ర్ రావు, ప్రజా ప్రతినిధులు, క‌లెక్ట‌ర్లు రాజీవ్ హ‌న్మంత్, హ‌రిత‌, సిపి
ర‌వీంద‌ర్, అధికారులు పాల్గొన్నారు.

tags : errabelli

Latest News
*ఎపిలో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*విజ్ఞత ప్రదర్శించిన పవన్ కళ్యాణ్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info