A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ని వదలి పివి కి మద్దతు ఇచ్చా-ఇంద్ర
Share |
July 3 2020, 8:15 pm

తెలంగాణ వ్య‌క్తి కావ‌డం వ‌ల్లే అప్ప‌టి పీవీ ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తునిచ్చా: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
పీవీ మైనారిటీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
పీవీతో ‘అల్లోల’కు సన్నిహిత సంబంధం
పీవీ నరసింహారావుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి‌ నివాళి
నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో పుష్పాంజలి ఘటించిన మంత్రి
భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకుని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ
శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పీవీకి నివాళుల‌ర్పించారు. నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
పుష్పాంజలి ఘటించారు.  పీవీ శతజయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ
మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆదిలాబాద్‌ ఎంపీగా ఉన్నాను.
1991లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచాను. 1993 లో పీవీ ప్రభుత్వం  మైనార్టీలో పడింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి
పీవీ పీయంగా ఉండడంతో రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతుగా నిల‌వాల‌నుకున్నాను. టీడీపీకి రాజీనామ చేసి
 మైనార్టీలో ఉన్న పీవీ ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తునిచ్చాను. నాతో పాటు టీడీపీ, జేఎంఎం నుంచి కొంత‌మంది ఎంపీలు ఆయ‌న‌కు
మద్దతుగా నిలవడంతో  పీవీ ప్రభుత్వం నిలబడింది. ఆయనను చాలాసార్లు కలిసే అవ‌కాశం ల‌భించింది.  పార్లమెంట్
గ్రామీణాభివృద్ధిస్థాయి సంఘంలో నేను సభ్యునిగా ఉన్నప్పుడు గ్రామీణాభివృద్ధిపై ఆయనతో కలిసి పనిచేశాను. 1993లో
బాసర రావాలని పీవీని కోరగా..  బాసరకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. నిర్మల్ బహిరంగ సభలో పాల్గొని
పట్టణంలో ఎన్నిక‌ల ప్రచారం కూడా చేశారు. ఆ సభతోపాటు  ఎస్సారెస్పీ వరద కాలువ శంకుస్థాపన సమయంలో పీవీ
ఉన్న‌ వేదికపై రెండుసార్లు మాట్లాడే అవకాశం లభించింది. దేశ ప్ర‌జ‌ల‌కు పీవీ ఎంతో సేవ చేశారని తెలిపారు. దేశం విపత్కర
సమయంలో ఉన్నపుడు ఆర్థిక సంస్కరణలు తెచ్చి, పరిస్థితులను గాడిన పెట్టిన మొట్టమొదటి ప్రధాని పీవీ అని ఆయ‌న
సేవ‌ల‌ను కొనియాడారు.  ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఆయన సంస్కరణల వల్లే మ‌న‌ దేశానికి ప్రపంచంలో గుర్తింపు
వచ్చిందని ప్ర‌శంసించారు.

tags : indrakaranreddy

Latest News
*ఎపిలో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*విజ్ఞత ప్రదర్శించిన పవన్ కళ్యాణ్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info