A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కంచాలు కొడితే చంద్రబాబు కేసులు పెట్టించారే
Share |
July 9 2020, 3:01 am

కాపులను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత తోట త్రిమూర్తులు అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన మోసాలపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఏం చెబితే పవన్‌కళ్యాణ్ అదే చెప్పారని త్రిమూర్తులు అన్నారు.2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి జనసేన తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదని త్రిముర్తులు ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య మ్యాచ్ ఫిక్స్ ఉందనడానికి ఇదే ఉదాహరణ అని చెపప్పారు. ముద్రగడ ఉద్యమం చేస్తుంటే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయించారని తెలిపారు. బ్రిటిష్ పరిపాలనలో కూడా లేని విధంగా ఉద్యమాన్ని అణగదొక్కాలని చూశారని ధ్వజమెత్తారు. కంచం కొడితే కూడా చంద్రబాబు కేసులు పెట్టించారని మండిపడ్డారు. కాపులు ఎక్కువగా ఉన్నారనే భీమవరంలో పవన్ కల్యాణ్ పోటీ చేశారని, గాజువాకలో కూడా కాపులే ఎక్కువగా ఉన్నాపవన్ కల్యాణ్‌ను ఓడించారని గుర్తుచేశారు.కాపులతో సహా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన పవన్ కు సూచించారు.

tags : tota trimurthulu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info