A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా-సోషల్ మీడియా ప్రచారం నమ్మవద్దు-ఈటెల
Share |
July 3 2020, 8:05 pm

తెలంగాణలో కొన్ని వేల మంది కరోనా కోలుకుంటే, సోషల్ మీడియాలో కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆక్సిజన్ అందక చెస్ట్ ఆస్పత్రిలో మరణించిన ఘటనపై ఆయన వివరణ ఇచ్చారు. ఆ రోగి పలు ఆస్పత్రులు తిరిగిన తర్వాత అక్కడకు వచ్చారని,ఇతర సమస్యల కారణంగా ఆ వ్యక్తి మరణించారని ఆయన చెప్పారు.ప్రభుత్వ ఆస్పత్రులలో పెద్ద ఎత్తున చికిత్సలు చేస్తున్నామని, అయినా కొందరు ఇలా ప్రచారం చేయడం వల్ల వైద్య సిబ్బంది స్పూర్తిని దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం పూర్తి శ్రద్ద తీసుకుంటుందని అన్నారు. పదివేల బెడ్ లకు ఆక్సిజన్ సదుపాయం కూడా కల్పిస్తున్నామని ఆయన అన్నారు.వంటిలేటర్లు కూడా వెయ్యి సిద్దం గా ఉన్నాయని,కాని గాందీ ఆస్పత్రిలో వెంటిలేటర్ల అవసరం పది మందికే ఉందని ఆయన చెప్పారు. దేశం అంతటా కేసులు పెరుగుతున్నాయని, అలాగే హైదరాబాద్ లో పెరిగాయని, దీనిపై ప్రజలు భయపడవద్దని అన్నారు. బాద్యత లేని వ్యక్తులు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన అన్నారు. ఎన్ని వందల కోట్ల రూపాయలు అయినా ఖర్చు చేసి ప్రజలను కాపాడుకుంటామని ఆయన అన్నారు.హైదరాబాద్ లో కరోనా పరీక్షలు పెంచుతామని అన్నారు.అయితే కరోనా లక్షణాలు లేకపోయినా కొంతమంది పరీక్షలు చేయించుకుంటున్నారని, అలా చేయించుకోవలసిన అవసరం లేదని ఆయన అన్నారు.

tags : eetela

Latest News
*ఎపిలో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*విజ్ఞత ప్రదర్శించిన పవన్ కళ్యాణ్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info