A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సీనియర్ రాజకీయనేత లా మారిన నిమ్మగడ్డ
Share |
July 3 2020, 6:53 pm

ఆంద్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా కొనసాగాలని గట్టి ప్రయత్నం చేస్తున్న రిటైర్డ్ ఐఎఎస్ అదికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొందరు రాజకీయ నేతలను కలిసిన తీరు వివాదాస్పదం అయింది. ప్రత్యేకించి బిజెపి నేతలను కలవడం చర్చనీయాంశం అయింది.దీనితో ఆయన నిబద్దత, నిజాయితీ ప్రశ్నార్దకంగా మారాయి.టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, బిజెపి మాజీ మంత్రి కామినేసి శ్రీనివాస్ లను రమేష్ కుమార్ హైదరాబాద్ పార్క్ హయత్ లో కలిసిన వీడియోలు టివీలలో విస్తారంగా ప్రచారం అయ్యాయి.దాంతో వీరు ముగ్గురు కలిసి ఏదో కుట్ర చేస్తున్నారని వైసిపి ఆరోపణలు చేసింది. దీని వెనుక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని కూడా వారు అనుమానించారు. సుజనా చౌదరి మాత్రం రమేష్ కుమార్ తమకు కుంబమిత్రుడని, ఆయనతో వేరే చర్చలు జరపలేదని చెప్పి తప్పించుకోచూశారు. కాని టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలిసి చెప్పారో, తెలియక చెప్పారో కాని కొన్ని విషయాలు వెల్లడించారు. సుజనాను ,కామినేనిని రమేష్ కలవడం తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో అదికారంలో ఉన్నవారిని కలిసి వైసిపికి వ్యతిరేకంగా పిర్యాదు చేయాలని కోరడానికి రమేష్ కలిశారని చెప్పారు. సుప్రింకోర్టులో పెండింగులో ఉన్న కేసు గురించి కేంద్రంలో ఉన్నవారిని ఎలా కలుస్తారో ఎవిరికి తెలియదు. అంటే సుజనా చౌదరి ద్వారా కేంద్రంలోనో, మరెక్కడో పైరవీ చేయించాలని రమేష్ కుమార్ పార్క్ హయత్ కు వెళ్లినట్లు టిడిపి నేత వ్యాఖ్యల బట్టి అర్ధం అయ్యే పరిస్థితి ఏర్పడింది.అసలు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, లేదా రాజ్యాంగ పదవిలో కొనసాగాలని అనుకుంటున్న వ్యక్తి అలా రాజకీయ పార్టీల నేతలను కలవవచ్చా అన్న నైతిక ప్రశ్నకు వీరు సమాదానం ఇవ్వడం లేదు. నిజానికి రమేష్ కుమార్ గత కొద్ది నెలల నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న విషయం పదే,పదే రుజువు అవుతోంది. కోర్టులో ఆయనకు సాంకేతిక పరమైన కారణాలతో అనుకూల తీర్పు వచ్చి ఉండవచ్చు. లేదా ఇంకా అనుకూల తీర్పులు వస్తే రావచ్చు. అది వేరే విషయం. కాని తీర్పుల ఆదారంగానే ఒక వ్యక్తి ప్రవర్తనను అంచనావేసే రోజులు కావివి. తీర్పులు వేరుగా ఉండవచ్చు. ప్రజల మనోభావాలు మరో రకంగా ఉండవచ్చు.ఇది అనేక సందర్భాలలో రుజువు అయింది.కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినంతమాత్రాన పాపం చేసినట్లు, అనుకూలంగా వచ్చేస్తే పవిత్రుడు అయిపోయినట్లు అన్నిసార్లు అనుకోనక్కర్లేదన్నది చాలామంది అబిప్రాయం. అది వేరే విషయం.రమేష్ కుమార్ రాజ్యాంగపరమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్నానని పలుమార్లు చెప్పారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఆయన బాద్యత. నిజానికి గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే ఈ ఎన్నికలు జరగవలసి ఉంది.కాని వివిధ కారణాల వల్ల జరగలేదు.ఆ తర్వాత అదికారంలోకి వచ్చిన జగన్ రిజర్వేషన్ లపై కోర్టు తీర్పు వచ్చాక ఎన్నికలు జరపడానికి సిద్దం అయ్యారు. ఆ తర్వాత ఆయన ఎన్నికలలో ధన ప్రభావం తగ్గించడానికి, మద్యం ప్రవాహం తగ్గించడానికి ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. అప్పుడు కూడా రమేష్ కుమార్ దానిపై అభ్యంతరాలు చెప్పలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలై కొన్ని చోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరగడంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కాని, మరికొన్ని పార్టీలు కాని యాగీ చేయడం మొదలు పెట్టాయి. నిజంగానే ఎక్కడైనా బలవంతంగా అదికారం ఉపయోగించి ప్రత్యర్దుల నామినేషన్లను ఉపసంహరింప చేస్తే తప్పే అవుతుంది. ఆలాంటి వారిపై చర్య తీసుకోవడం కూడా సరైన చర్యే అవుతుంది.కాని అప్పుడు రమేష్ కుమార్ అలాంటి ఆరోపణలు వచ్చిన వాటి గురించి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.అన్ని ఏకగ్రీవాలు చెల్లుతాయని కూడా ప్రకటించారు.మరి అంతలోనే ఏమయ్యిందో కాని ఆయన దోరణి సడన్ గా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఛీప్ సెక్రటరీ, డిజిపి వంటివారికి మాట మాత్రం చెప్పకుండా కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేశారు.ప్రతిపక్షాలు రకరకాల కారణాలతో ఎన్నికల వాయిదాకు డిమాండ్ చేయవచ్చు.కాని ప్రభుత్వంతో కూడా మాట్లాడి చేయాల్సిన పనిని నిమ్మగడ్డ రమేష్ ఏకపక్షంగా చేశారు.అది ప్రభుత్వానికి అసంతృప్తి కలిగించింది.ముఖ్యమంత్రి జగన్ దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.ఆ తర్వాత నిమ్మగడ్డ లేఖ ప్రహసనం బయటకు వచ్చింది. ఆయన కేంద్రానికి ఎపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేఖ రాశారన్నది నిజమా?కాదా అన్నది ఇంతవరకు తేలలేదు.మొదట తాను రాయలేదని నిమ్మగడ్డ చెప్పడం , ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ లేఖపై సిఐడి విచారణ ఆరంభం కాగానే తానే ఆ లేఖ రాశానని చెప్పడం ద్వారా తెలుగుదేశం నేతలను రక్షించడానికి ఆయన యత్నించారన్న అబిప్రాయం కలిగింది.నిజంగానే ఆయన ఆ లేఖ రాసి ఉంటే అంత చెత్త భాష వాడతారా అన్న సందేహం వస్తుంది.తనకు భద్రత లేదని ముందుగా రాష్ట్రానికి చెప్పకుండా కేంద్రానికి ఎలా ఫిర్యాదు చేస్తారన్న ప్రశ్న కూడా వస్తుంది. అంటే ప్రదాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ట్రాప్ లోకి ఆయన వెళ్లిపోయారన్నది అర్దం అవుతుంది.ఆ లేఖలో ఏకగ్రీవ ఎన్నికలను తప్పు పట్టడం,మద్యం, డబ్బును వ్యతిరేకిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ను తప్పు పట్టడం ..ఇలాంటివన్ని ఉండడం,దానిని నిమ్మగడ్డ భుజాన వేసుకోవలసిన దయనీయ పరిస్థితికి వెళ్లారు.తీరా సిఐడి విచారణలో దానికి సంబందించిన డ్రాఫ్ట్ పైల్ కాని, పెన్ డ్రైవ్ కాని లేకపోవడం,పైగా ద్వంసం చేయడం వంటివి ఆయన నిజాయితీని,చిత్తశుద్దిని ప్రశ్నార్దకం చేశాయి.ఆ తర్వాత ప్రభుత్వం నిమ్మగడ్డను తొలగించడానికి వీలుగా ఆర్డినెన్స్ ను తీసుకు రావడం,దానిపై ఆయన కోర్టుకు వెళ్లడం, అక్కడ అనుకూల తీర్పు రాగానే తాను చార్జీ తీసుకున్నానని సొంతంగా ప్రకటించుకోవడం జరిగింది. ఇప్పుడు మొత్తం కేసు సుప్రింకోర్టులో పెండింగులో ఉంది.అంతేకాక ఒక్క వాయిదాకు హాజరైతే లక్షలు,కోట్ల ఫీజు వసూలు చేసే హరీష్ సాల్వే వంటి పెద్ద లాయర్ ను నియమించుకోవడం కూడా అదరిని ఆకర్షించింది. దానికి తోడు నిమ్మగడ్డ పిటిషన్ వేసుకున్నా,ఆయనకు అనుకూలంగా కామినేని శ్రీనివాస్ సొంతంగా పిటిషన్ లు వేయడం కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది.ఇప్పుడు సుజనాతో వీరు ఇద్దరు కలవడం వెనుక కుట్ర ఉందా?లేదా?చంద్రబాబుతో ఆ భేటీ సమయంలో పేస్ టైమ్ ద్వారా మాట్లాడారా?లేదా అన్నది మనం చెప్పలేం.దానికి సంబందించిన ఆదారాలు ఏవైనా బయటపడితే తప్ప చెప్పలేం.వారు ఏ ఉద్దేశంతో కలిసినా ,అందులో ఎలాంటి కుట్ర ఉన్నా,లేకున్నా,ఒకటి మాత్రం వాస్తవం.కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా నిమ్మగడ్డ వ్యవహరించారన్న అబిప్రాయం కలగడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం ఉండదు.ఒక్క ఏడాది పదవి కోసం నిమ్మగడ్డ ఇన్ని తంటాలు మామూలుగా అయితే పడతారా?అదికారం కోల్పోయిన నిరాశ,నిస్పృహలో ఉన్న తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ వంటివారిని అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు చేస్తోందా అన్న సందేహం సర్వత్రా వచ్చింది. సుజనా చౌదరి ని ఇప్పటికీ టిడిపి నేతలు చాలా గౌరవంగా మాట్లాడడమేకాక, బిజెపిలో పెద్ద నేతగా గుర్తించడం కూడా గమనించదగిన అంశమే. టిడిపి నుంచి బిజెపికి వెళ్లిన సుజనా ను మాట మాత్రం కూడా చంద్రబాబు ఒక్క మాట అనలేదు.పైగా ఇప్పుడు కూడా తన తరపున ఇలాంటివారిని డిల్లీ స్థాయిలో ఆయన వాడుకుంటున్నారన్నది ఎక్కువ మంది నమ్మకం. అంటే బిజెపిలో తన ఏజెంట్లను చంద్రబాబు పెట్టుకున్నారన్నభావన ఉంది.ఈ నేపధ్యంలోనే దీనిని కుట్ర కోణంలో చూస్తున్నారు.అది ఏ తరహా కుట్ర అన్నది ఎవరూ చెప్పలేరు.కొందరు ప్రైవేటు హోటల్ లో వీడియో పుటేజీ బయటకు వచ్చిందని తెగ బాధపడ్డారు.ఇది మొదటి సారి కాదు. చివరిసారి కాదు. రాజ్ భవన్ లో పుటేజీ వస్తే గొప్ప పరిశోధన చేశామని చెప్పుకున్న పత్రికలవారు ఇప్పుడు పుటేజీ బయటకు వస్తే చాలా బాదపడిపోవడం చిత్రంగానే ఉంటుంది.దొంగతనం చేస్తే మాత్రం సిసి టీవీ పుటేజీ బయటపెడతారా అన్నట్లుగా వీరు మాట్లాడుతున్నారు.ఏది ఏమైనా ఒక్కటి మాత్రం చెప్పక తప్పదు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న చర్యల వల్ల, రాజ్యాంగ వ్యవస్థల గౌరవం పెరగలేదు.దిగజారుతోంది.వీరు నిష్పాక్షికంగా ఉంటారో,ఉండరో వేరే సంగతి.కనీసం అలా నిష్పాక్షికంగా ఉన్నట్లు కనిపించకపోయినా పర్వాలేదన్నట్లుగా వ్యవహరించడం ద్వారా వారి ప్రతిష్టను వారు పోగొట్టుకుని ,వ్యవస్థల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారన్నదే బాదకరమైన విషయం.ఒక బిజెపి నేత వ్యాఖ్యానించినట్లు నిమ్మగడ్డ ఒక సీనియర్ రాజకీయ నేతగానే వ్యవహరిస్తూ రాజ్యాంగ వ్యవస్థల స్పూర్తిని దెబ్బతీస్తున్నారన్నది వాస్తవం.

tags : nimmagadda

Latest News
*హైదరాబాద్ సురక్షితమే
*పరారీ లో టిడిపి మాజీ మంత్రి
*రఘురాజు విలువను కాపాడుకోలేకపోయారు
*రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
*38898 కరోనా పరీక్షలు-789 పాజిటివ్
*జగన్ కు ముద్రగడ లేఖ రాశారు కాని ..
*చంద్రబాబు హయాంలో అలా జరిగింది- జగన్
*ప్రగతి బవన్ కు కూడా కరోనా తాకిందా
*నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
*వైసిపి నేత హత్య - టిడిపి మాజీ మంత్రిపై కూడా కేసు
*22న ఎపి మంత్రి వర్గ విస్తరణ?
*మనసుంటే అబినందించండి- స్పీకర్
*అప్పట్లో మరుగుదొడ్లపై చంద్రబాబు బొమ్మవేశారే
*81 కోట్ల చేప పిల్లలను పెంచుతాం
*Skill building need of the hour
*కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
*కేంద్రం సూచనలమేరకు ఎపిలో అన్ లాక్
*ప్రతీకార రాజకీయమే అన్న కాంగ్రెస్
*కరోనా నుంచి కోలుకున్న హోం మంత్రి
*అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
*వెంకయ్య సంప్రదాయం పాటించి రఘురాజుపై..
*రఘురాజు మా నేతను ఏమన్నారంటే..విజయసాయి
*మన సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంది-మోడీ
*న్యాయస్థానాలను బెదిరిస్తారా- టిడిపి
*రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
*ప్రధాని మోడీ లడ్డాక్ ఆకస్మిక పర్యటన
*తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
*హెచ్ 1 బి వీసా- బిడెన్ ఎన్నికల వాగ్దానం
*రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి
*రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
*దేశం అంతా జగన్ స్కీము లు అమలు చేయాలి
*నా వద్దకు ఎవరూ రాకండి- మంత్రి వినతి
*కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
*మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
*అచ్చెన్నాయుడు అగ్ర కులం కంటే ఎక్కువే
*27 శాతం కరోనా పాజిటివ్ వస్తున్నాయి...
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info