A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పివి ని కాంగ్రెస్ సొంతం చేసుకోలేకపోవడం..
Share |
July 9 2020, 5:06 am

ప్రపంచ ఆర్థిక చిత్రపటం లో భారత్ స్థానం సుస్థిరం చేసిన స్థితప్రజ్ఞుడు దివంగత పి వి నరసింహా రావు అని రాష్ట్ర
విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు.
అటువంటి మహానేత గుర్తింపుకు నోచుకోలేక పోయారని ఆయన పేర్కొన్నారు.

మానసికమరుగుజ్జులకు సైతం ఈ దేశంలోకీర్తిప్రతిష్ఠలులభించాయని,లభించాల్సిన పి వి ని మాత్రం కేంద్రంలోని
పాలకులు గుర్తించ లేక పోయారని ఆయన అన్నారు.
తొలి తెలుగు ప్రధాని పి వి నరసింహా రావు శతజయంతి ఉత్సవాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం విదితమే.
అందులో భాగంగా ఆదివారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలోనీ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి
దివంగత ప్రధాని పి వి నరసింహా రావు శతజయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ మైనారిటీ ప్రభుత్వాన్ని
ఐదు ఏండ్లు నిలబెట్టిన మహానేతను ఆ పార్టీ కూడా సొంతం చేసుకోలేక పోవడం బాధాకరం గా ఉందన్నారు.
చారిత్రక సందర్భంలో కేంద్రంలో అధికారంలో కీ వచ్చిన అపర చాణుక్యుడి పాలనలోనే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో
పడి దేశాభివృద్ధి మలుపు తిరిగింది అన్నది నిర్వివాదామన్నారు.
కార్పోరేట్స్థాయిలో గురుకులాలను అందించిన ధన్యజీవి అని నల్గొండ జిల్లాలోనీ సర్వేలు దివంగత ప్రధాని పి వి
చలువే నన్నారు 
బహుముఖ ప్రజ్ఞాశాలి,బహుభాషా కోవిదుడు అని బిరుదాంకితుడైన పి వి గారికి మెతకతనం....నానా పెట్టడం
అన్న పేర్లు ఉన్నాయన్నారు

కానీ మెతక తనం అన్నది ఆయన డైరీలో లేదని...నానా పెట్టడం ఆయన నైజం కాదని ఆయన తేల్చి చెప్పారు
అటువంటి మహానేత అనుభవ పాఠాలు వర్తమానానికి మార్గదర్శనం కావాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్
సంకల్పం అన్నారు.
ఆ చరిత్రను సుస్థిర పరిచేందుకు గాను దివంగత ప్రధాని పి వి నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను
సంవత్సరం పొడవునా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా గ్రంధాలయా సంస్థ అధ్యక్షుడు నిమ్మల
శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

tags : jagadeeshreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info