A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రతి నియోజకవర్గంలో పివి విగ్రహం
Share |
July 9 2020, 3:53 am

దేశ ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి ఆర్థిక రంగాన్ని ఒక మలుపు తిప్పిన ధీశాలి, అపర చాణక్యుడు, తెలంగాణ బిడ్డ,
భారత మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారికి తెలంగాణ ప్రభుత్వం సముచిత స్థానం, గౌరవం కల్పించిందని రాష్ట్ర
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఆదివారం పీవీ నరసింహారావు శత జయంతి దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అధికారికంగా
నిర్వహించిన వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. తొలుత పీవి చిత్రపటం వద్ద
జ్యోతి ప్రజ్వలన చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ
మాట్లాడుతూ..
రాష్ట్రంలోని ప్రతీ ఊరికీ పివి గొప్పతనం తెలిసేలా, ప్రజలంతా పివి ఘన చరిత్రను తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమాలు
రూపొందించాలని అధికారులు,  ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని
ఉమ్మడి  జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పీవీ గారి విగ్రహాన్ని ప్రతిష్టించాలని సూచించారు. తొలిగా ఖమ్మం నుండే
ప్రారంభిస్తామని అన్నారు. ఖమ్మం లకారం సర్కిల్లో వద్ద పీవీ కాంస్య విగ్రహాన్ని రాష్ట్రంలో మనమే ముందుగా
ప్రతిష్టించాలని మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి ని ఆదేశించారు.
జూన్ 28న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జన్మదిన వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం వారికి
దక్కిన అపూర్వ గౌరవమన్నారు.
పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయి. పివికి ముందు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? పివి
తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి ఎలా తయారైందో అందరికి తెలిసిందే.
పివి గారి శతజయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.10 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఉత్సవాలు ఏడాది
పాటు నిర్వహించడం మన బిడ్డకు మనం అందిస్తున్న నివాళి.
‘పివి తెలంగాణ ఠీవి’ అని ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వపడేలా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది.  ఆయన గొప్పతనం, చేసిన
సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసే విధంగా అనేక విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించనుండటం శుభపరిణానం
అన్నారు.
పివి బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వతంత్ర్య సమరయోధుడుగా, రాజకీయ నాయకుడుగా, జర్నలిస్టుగా, బహుభాషా

కోవిదుడుగా, రచయితగా, కవిగా సేవలందించారు. గొప్ప సాహితీవేత్త. అనేక భాషలపై పట్టున్న పండితుడు. అనేక
రచనలు చేశారు.
ఆయా రంగాల్లో ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరికి తెలిసేవిధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది.
పివి నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశ గతిని మార్చిన గొప్పవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ
అర్హుడు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, సుడా చైర్మన్ విజయ్ కుమార్ గారు, మేయర్ పాపాలాల్ గారు,
ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ గారు, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ గారు, పోలీస్ కమీషనర్ తఫ్సిర్ ఇక్బాల్ గారు,
మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి గారు, అదనపు కలెక్టర్ మధుసూదన్ గారు, ఎమ్మెల్యేలు కె ఉపేందర్ రెడ్డి గారు,
రాములు నాయక్ గారు, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి గారు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్ గారు అధికారులు
ఉన్నారు.

tags : ajaykumar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info