A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
Share |
July 6 2020, 9:12 am

ఈ-క్రాపింగ్‌ మీద సమగ్ర విధివిధానాలను, ఎస్‌ఓపీలను వెంటనే తయారుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆర్జీకే(రైతు భరోసా కేంద్రాలు)పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్‌ చేయాలన్నారు. జిల్లా, మండల స్థాయిల్లో అగ్రికల్చర్‌ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైయస్సార్‌ రైతు భరోసాకేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని దాని పరిధిలో ఏయే పంటలు వేయాలన్నదానిపై పంటల ప్రణాళికను సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏయే రైతు ఏ పంట వేస్తున్నారన్నదానిపై ఈ- క్రాపింగ్‌ కోసం విధివిధానాలను మరింత సమగ్రంగా తయారుచేసి, వాటిని వైయస్సార్‌ రైతు భరోసాకేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. మార్కెటింగ్‌ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info