A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
Share |
September 22 2020, 10:56 am

రైతులందరిని ఐక్యం చేసి,వారికి లాభం చేకూర్చే పంటలను వేయడమే తెలంగాణ సమగ్ర వ్యవసాయ విధానం లక్ష్యమని మంత్రి జగదీష్ రడ్డి అన్నారు. ఈ విధానం సఫలం అయితే రైతులంతా ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే ఉంటారన్న భయంతో ప్రతిపక్సాలకు చెందిన కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.రైతులు సరైన పంటలు వేసుకోవడం కాని, వారి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ రాకూడదని, రైతులు బాగుపడడం ఈ ప్రతిపక్ష నేతలకు లేదని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వైపు ఇతర రాష్ట్రాల రైతులు కూడా చూస్తున్నారని ఆయన అన్నారు. రైతుల గురించి, వ్యవసాయం గురించి ఆలోచించే నేత కెసిఆర్ తప్ప ,మరొకరు లేరని జగదీష్ రెడ్డి అన్నారు. కొత్త వ్యవసాయ విదానంపై రైతులంతా మద్దతు ఇస్తున్నారని ఆయన అన్నారు. మార్కెటింగ్ , ఇతర ప్రయోజనాలు రైతులకు వచ్చేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

tags : niranjanreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info