A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
Share |
September 22 2020, 11:03 am

విశాఖలోని ఆర్.ఆర్ .వెంకటాపురం వద్ద ఎల్.జి.పాలిమర్స్ సంస్థ నుంచి విడుదలైన స్టైరైన్ గ్యాస్ అక్కడి ప్రజలకు తీవ్ర సమస్యలను సృష్టించిన నేపద్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్యాలలో కాన్సర్ కారకాలు ఏమైనా ప్రభావం చూపుతాయా అన్నదానిపై ఐదేళ్లపాటు పర్యవేక్షించాలని సంస్థను ఆదేశించారు. ఇందుకోసం ప్రముఖ ఆస్పత్రులతో కలిసి పనిచేయాలని సూచించారు.గర్భీణీ స్త్రీల ఆరోగ్యాన్ని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించలని కూడా ఎన్.జి.టి నివేదిక తెలిపింది. ఈ పరిశ్రమలు ఉన్నచోట 200 మీటర్ల లోపు ఎలాంటి వివాస భవనాలు ఉండరాదని ,కాని అనేక లే అవుటక్లకు ఎలా అనుమతి ఇచ్చారని అదికారులను ప్రశ్నించింది.అంతేకాక బఫర్ జోన్ ను వృద్ది చేయవలసి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

tags : vizag, layouts

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info