A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
Share |
July 6 2020, 7:27 am

తిరుమల భక్తులకు శుభవార్త. స్వామి వారి దర్శనానికి అనుమతులు ఇవ్వడం ఆరంభం అయింది. తొలుత ప్రయోగాత్మకంగా దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తిరుమల,తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి సింఘాల్ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ముందుగా టిటిడి ఉద్యోగులు, స్థానికులకు ప్రయోగాత్మకంగా దర్శనానికి అనుమతి ఇస్తారు. ఒక్కొక్కరికి మద్య ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెఎస్వి ప్రసాద్ సర్కులర్ జారీ చేశారు.ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలకు తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చిన నేపద్యంలో ఈ ప్రయోగాత్మక దర్శనాలను అనుమతిస్తున్నారు.

tags : tirumala, trial run

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info