A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
Share |
July 6 2020, 9:09 am

ఎపిలో పెట్టుబడులపై హిందూ పత్రికలో వచ్చిన ఒక కదనం ఆసక్తికరంగాఉంది. గత టిడిప హయాంలో అవినీతి కారణంగా ఒక ప్రముఖ సంస్థ పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి వెళ్లిపోగా, ఇప్పుడు కొత్త ప్రభుత్వ హయాంలో తిరిగి పెట్టుబడులు పెట్టడానికి ముందుఉ వస్తోంది. గోల్డ్ రిఫైనరీలో అనుభవం ఉన్న ఈ స్విస్ కంపెనీ కి గత ప్రభుత్వ హయాంలో విజయవాడ వద్ద ముప్పై ఎకరాలు కేటాయించారు. ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నిసార్లు కంపెనీవారు అదికారులను తదుపరి ప్రక్రియ పూర్తి చేయాలని కోరినా, వారు శ్రద్దచ ఊపలేదు.దానికి కారణం అవినీతి అని వారు అర్దం చేసుకున్నారు.లంచాలు ఇవ్వడానికి వారి దేశ నిబంధనలు అనుమతించవు. దాంతో ఎపిలో పెట్టుబడి పెట్టకుండా వెనక్కి వెళ్లిపోయారు.అదే సమయంలో ఉత్తరాఖండ్ లో ఒక యూనిట్ ఏర్పాటు చేశారు.ఆరువేల మందికి ఉపాది కల్పించే అవకాశం ఉన్న ఈ కంపెనీవారు తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక అనుసరిస్తున్న పద్దతులు గమనించి,ఎపిలో తమ ప్లాంట్ ను ప్రారంబించడానికి ముందుకు రావలని భావిస్తున్నారని ఆ కధనం చెబుతోంది.ఏడాదికి 250 టన్నుల బంగారాన్ని, 950 టన్నుల వెండిని శుద్ది చేయడానికి ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు.

tags : ap, hindu story

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info