A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
Share |
July 6 2020, 9:12 am

ఎపి ప్రభుత్వం స్టేట్ టెక్నికల్ కో ఆర్డినేటర్లను నియమించింది. వీరు పత్రికలు, సామాజిక మాద్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ స్కీములు, కార్యక్రమాలపై వచ్చే కదనాలు, వార్తలను, సమాచారంపై వీరు పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. ఎనిమిది మందిని ఈ కోఆర్డినేటర్లుగా నియమించారు. చేకూరి కిరణ్‌, జక్కం సుధాకర్‌రెడ్డి, మల్లాది సందీప్‌కుమార్‌, ఎ.లింగారెడ్డి, కేపీ ప్రసాద్‌రెడ్డి, ఐ.నారాయణరెడ్డి, జి.దశరథరామిరెడ్డి, వై.రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. వీరంతా నిరంతరం సమాచారం,కథనాలపై నివేదికలను రూపొందిస్తూ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు అందచేస్తారు. ఈ బృందం సభ్యులను గతంలో ‘సాంకేతిక సమన్వయకర్తలు’గా ప్రభుత్వం నియమించగా.. తాజాగా వారి పోస్టుల్ని ‘రాష్ట్ర సాంకేతిక సమన్వయ కర్తలు’గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సీఈవో ఆధ్వర్యంలోని విభాగంలో పనిచేస్తారు.

tags : ap, technical coronations

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info