A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
Share |
July 6 2020, 6:59 am

విశాఖపట్నంలో ట్రామ్‌ కారిడార్‌ ప్రాజెక్టు నివేదిక తయారు చేసే అవకాశం అర్బన్‌ మాస్‌ ట్రాన్సిట్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఎంటీసీఎల్‌) వచ్చింది. విశాఖ మెట్రో రీజియన్ పరిధిలోని 60.20 కిలోమీటర్ల ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు డీటేయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేయాలని ప్రభుత్వం యూఎంటీసీఎల్‌కు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. విద్యుదయస్కాంత శక్తితో నడిచే ట్రాక్‌లెస్‌ రైలు వ్యవస్థనే ట్రామ్‌ కార్‌ అని పిలుస్తారు. ప్రత్యేకంగా రైలు ట్రాక్‌ మార్గం అనేది లేకుండానే రోడ్లపైనే ప్రయాణించడం ట్రామ్‌కార్‌ ప్రత్యేకత. ఒక లగ్జరీ బస్‌ మాదిరిగానే ఈ ట్రామ్‌కార్‌ ఉంటుంది. 300 నుంచి 500 వరకూ ప్రయాణించవచ్చు. ప్రయాణికుల రద్దీ పెరిగితే అవసరానికి తగ్గట్టుగా దారిలో ఉన్న స్టేషన్‌లో అదనపు బోగీ అనుసంధానం చేసేలా వ్యవస్థ ఉండటం దీని ప్రత్యేకత.

tags : vizag

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info