A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
Share |
July 6 2020, 7:32 am

అమెరికాలో అల్లర్లపై ఆ దేశ అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆయా రాష్ట్రాల గవర్నర్ లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.వెంటనే రాష్ట్రాలలో అల్లర్లను నివారించకపోతే, ఇందుకోసం నేషనల్ గార్డులను అనుమతించకపోతే, తాను సైన్యాన్ని రంగంలో దించవలసి వస్తుందని ఆయన అన్నారు. శాంతి, భద్రతలను కాపాడడం తన ప్రథమ కర్తవ్యం అని, అందుకు తగిన చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్లు బలహీనంగా ఉండడం వల్లే నిరసనలు ఈ స్థాయికి చేరాయని ఆరోపించారు.ఆందోళనకారుల్ని అరెస్టు చేయాలని, పదేళ్లపాటు జైల్లో పెట్టండి. అప్పుడు ఇలాంటి ఘటనలు మరోసారి జరగవని కూడా ఆయన అన్నారు. వాషింగ్టన్ డీసీలో మేం అదే చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రజలు చూడని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

tags : trump

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info