A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
Share |
July 6 2020, 9:13 am

ప్రముఖ సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై కేసు నమోదు అయింది. ఒక టెలివిజన్ చానెల్ చర్చా కార్యక్రమంలో ఆయన ఎస్సి,ఎస్టి ల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని కొందరు ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై ఎస్సి,ఎస్టి అత్యాచార నిరోదక చట్టం కింద కేసు పెట్టారు. ఈ చట్టం కింద నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.అంటరానితనాన్ని కొనసాగించాలనేలా ఆయన మార్చి 23న కరోనాపై పద్యం పాడారని, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజునే ఒక యూట్యూబ్ చానల్ లో ప్రసారం చేశారని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఫిర్యాదు చేశారు.న్యాయ నిపుణుల సలహా తీసుకుని కేసుపై దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు.

tags : jonnavittula

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info