A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
Share |
July 6 2020, 9:16 am

ప్రముఖ నటుడు, హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఏ వివాదం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించినట్లుగా ఉంది. కొద్ది రోజుల క్రితం మంత్రి తలసాని వద్ద భూములు పంచుకోవడానికి సినీ ప్రముఖులు వెళ్లారా అని ఆవేశంగా బాలకృష్ణ ప్రశ్నించడం,అది వివాదాస్పదం కావడం తెలిసిందే.ఈ నేపధ్యంలో మీడియాలో ఆయన కొత్తగా మాట్లాడిన విషయాలు వచ్చాయి. కెసిఆర్ ను కలవడానికి సిని పరిశ్రమవారు వెళ్లినప్పుడు తనను ఎందుకు పిలవలేదో తనకు తెలియదని ఆయన అన్నారు. రాజకీయ కోణంలో కెసిఆర్ పై తాను గతంలో చేసిన విమర్శల కారణంగా పిలవకపోతే ఆ విషయం చెప్పి ఉండాల్సిందని అన్నారట.కెసిఆర్ కు తనపై ఎన్నడూ కోపం లేదని, రాజకీయం వేరని, ఇది వేరని ఆయన అన్నారు. ఎన్.టి.ఆర్.అబిమానిగా కెసిఆర్ కు తాను అంటే పుత్రవాత్సల్యం అని చెప్పారు.మిగిలిన విషయాలు మాట్లాడనని అన్నారు.జూనియర్ ఎన్.టి.ఆర్. రాజకీయాల్లో రావడం అనేది అతని ఇష్టమని, వృత్తిని వదులుకుని రమ్మని చెప్పలేమన్నారు.

tags : balakrishna, talk

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info