A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
Share |
July 6 2020, 9:19 am

తనపై పార్టీలోనే తప్పుడు ప్రచారం జరుగుతోందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆయన పార్టీ మారతారని వచ్చిన వార్తలపై స్పందించారు. తమలోనే తప్పుడు ప్రచారం చేసేవారు ఉన్నారని,వారిని కట్టడి చేయవలసిన బాద్యత పార్టీ నాయకత్వంపై ఉందని ఆయన అన్నారు. పార్టీ మారాలని చాలా మంది అడుగుతారని, అంత మాత్రాన వెళ్లిపోతున్నట్లు కాదని ఆయన చెప్పారు. మహానాడులో తాను పాల్గొన్నానని, తీర్మానం ప్రవేశపెట్టిన రోజున తన సోదరుడి పుట్టినరోజు ఉన్నందున రాలేకపోయానని ఆయన వివరించారు.పార్టీ కార్యాలయానికి ముందే సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు పోరాటానికి పూర్తి అండగా ఉంటానని చెప్పారు. మార్చి 20వ తేదీ నుంచి నిన్న మొన్నటి వరకు తాను ఏపీలో ఉన్నట్లు గానీ, ఒంగోలులో మంత్రి బాలినేనిని కలిసినట్లు గానీ నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సత్యప్రసాద్ అన్నారు.

tags : anagani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info