A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
Share |
July 6 2020, 9:21 am

ఎన్నికల కమిషనర్ గా తనకు తాను నియమించుకున్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజాస్వావ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు.ఈ నియామకం అయినా ప్రభుత్వమే ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నారు.రమేష్ కుమార్ కేవలం టిడిపి వారికి సాయం చేసే లక్ష్యంతోనే పనిచేశారని, ఆయన రాసిన లేఖ ఈ విషయం తెలియచేస్తుందని విజయసాయి అన్నారు. ఆ లేఖ పై నిజ నిర్దారణ చేయాలని తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని విజయసాయి గుర్తు చేశారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కోర్టు జడ్జిమెంట్‌ను క్షుణ్ణంగా చదివి ఆంధ్రప్రదేశ్‌ అడ్వకేట్‌ జనరల్‌ ప్రభుత్వానికి ఓ సూచన చేశారని వెల్లడించారు. అధికార పార్టీని గూండాలు, రౌడీలు అంటూ నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాశారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వి ‘టీడీపీ రాసిన లేఖనే నిమ్మగడ్డ ఎందుకు పంపారని అడుగుతున్నా. ప్రజాస్వామ్య రక్షకులా లేక మీరు ప్రజాస్వామ్య హంతకులా. నిమ్మగడ్డ ఎన్నికల‌ కమిషనర్‌గా ఉండాలని చంద్రబాబు ఎందుకు పట్టుపడుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారు అని ఆయన ద్వజమెత్తారు.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info