A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
Share |
July 6 2020, 7:44 am

కోర్టులపై తాము వ్యాఖ్యానించలేదని, అయినా కోర్టులలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.కోర్టులంటే తమకు అపారమైన గౌరవం ఉందని, అయినా కొన్ని విషయాలు ప్రస్తావించక తప్పడం లేదని ఆయన అన్నారు.ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల విషయంలో కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకెళ్లే వెసులుబాటు పొందే ప్రయత్నం చేస్తామని తెలిపారు. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామంటే టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా రెండు వేల కోట్లు ఆదా చేశామని, ఇది కన్నా లక్ష్మీనారాయణకు కన్పించదా అని సూటిగా ప్రశ్నించారు. అక్రమాలను వెలికి తీశామని, దోషులను బయటపెడతామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దోషులను బయటపెట్టడం కొంచెం ఆలస్యం అవుతుందని తెలిపారు. ఏడాది పాలనలో జగన్ సృష్టించిన రికార్డులని మరుగున పర్చేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కోర్టులో పెడుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఏయే అంశాల్లో వేస్తున్నారో చూస్తే అర్ధం అవుతోందన్నారు. రోడ్డు మీద తాగి ప్రభుత్వాధినేతను తిడుతోంటే కోర్టులో కేసులు వేస్తారని, ఆ కేసులను వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లు వస్తున్నారని మండిపడ్డారు. వీటి వెనుక ఎవరు ఉన్నారో అందరికి తెలుసన్నారు. ఏడు రంగుల్లో ఏదో రంగు వేయాలి, దీనిపైనా కోర్టుకు వెళ్తామని తెలిపారు.

tags : sajjala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info