A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జూన్ 8 నుంచి మాల్స్, రెస్టారెంట్లకు కేంద్రం ఓకే
Share |
July 9 2020, 4:38 am

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించినా, పలు సడలింపులను ఇచ్చింది. జూన్ ముప్పై వరకు ఈ లాక్ డౌన్ కరోనా కంటైన్ మెంట్ జోన్ లకే పరిమితంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. జూన్ ఎనిమిది నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, గెస్ట్ హౌస్ సేవలకు అనుమతి ఇస్తారు. అలాగే అదే రోజు నుంచి దేవాలయాలకు ,ప్రార్దనా మందిరాలకు అనుమతి ఇస్తారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని కేంద్రం తెలిపింది.స్కూళ్లు, కాలేజీలు ,విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు.
జూలై నుంచి పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు ప్రారంభం అవుతాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. లాక్‌డౌక్‌ కారణంగా రెండు నెలలుగా మూతబడ్డ అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైళ్లు. సినిమా హాల్స్‌, జిమ్‌లు, బార్లు, స్విమ్మింగ్ పూల్స్‌, ఆడిటోరియంల ప్రారంభంపై త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.. అలాగే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మతపరమైన కార్యకలాపాలపై కూడా త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది.

tags : center

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info