A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజీవ్ రహదారిపై టోల్ పెంచారు
Share |
July 9 2020, 4:40 am

కరోనా ప్రభావమో, లేక ఇతర కారణాలో తెలియదు కాని టోల్ గేట్ల వద్ద రేట్లు పెరిగాయి. రాజీవ్ రహదారి టోల్ రేట్లు పెరిగాయి. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు కరీంనగర్ మీదుగా ఈ రహదారి వెళుతుంది. సిద్దిపేట,కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లేవారు ఈ రహదారిని వినియోగిస్తారు. కారు సింగిల్ ట్రిప్ కు ఏభై ఎనిమిది రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఒకరోజు పాస్ ఎనభై ఏడు రూపాయలు, నెల పాస్ రూ.1,740 చెల్లించాలి. బస్ లకు కూడా ఇదే రకంగా 117,175, 3510 రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ కొత్త చార్జీలు ఆదివారం అర్దరాత్రి నుంచి అమలులోకి వస్తాయి.

tags : toll

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info