A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్.టి.ఆర్ .ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారు
Share |
July 9 2020, 3:27 am

ఎన్.టి.ఆర్.చనిపోయిన పాతికేళ్ల తర్వాత కూడా ఆయన ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారని టిడిపి అదినేత చంద్రాబాబు నాయుడుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్విటర్ లో ఆయన వ్యాఖ్యలు చేశారు.

'బతికున్నోళ్లను మభ్యపెట్టడానికి పొగడ్తలతో మునగ చెట్టు ఎక్కించడం చూస్తుంటాం. 25 ఏళ్ళ క్రితం మరణించిన ఎన్టీఆర్‌ను భారతరత్న పేరుతో ఆటపట్టించడం ఆయనకు ఆత్మశాంతి లేకుండా చేయడమే. ప్రతి ఏటా తీర్మానం చేస్తారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలాడటం నీచాతినీచం' అని విజయసాయి పేర్కొన్నారు.

కరోనా కాలంలో కుట్రలు చేయడం ఎలా... అనే విషయంపై ఎవరైనా మాస్టర్ డిగ్రీ/ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఆన్ లైన్ కోర్సులు జూమ్ యాప్ ద్వారా చేయాలనుకుంటే.. మన నెగటివ్ థింకింగ్ పితామహ గడ్డం బాబుని సంప్రదించవచ్చు' అని మరో ట్వీట్ లో విజయసాయి రెడ్డి ఎద్దేవ చేశారు.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info