A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హాంగ్ కాంగ్ పై చైనా పెత్తనం- అమెరికా ఫైర్
Share |
July 9 2020, 4:42 am

హాంగ్ కాంగ్ పై పూర్తి పెత్తనం తెచ్చుకునేందుకు గాను చైనా పార్లమెంటు ఆమోదించిన జాతీయ భద్రత బిల్లుపై అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇది హాంగ్ కాంగ్ ప్రజలకు తీరని విషాదమని ఆయన వ్యాఖ్యానించారు.ఇది వారికే కాదు..చైనా ప్రజలకు,అంతేకాదు..ప్రపంచం మొత్తానికి ఇది పెనువిషాదం అని ఆయన అన్నారు.అమెరికా యూనివర్సిటిల్లోని కొంతమంది చైనీస్‌ విద్యార్థులపై నిషేధం విధించనున్నట్లు ట్రంప్ చెప్పారు. చైనా మిలిటరీతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న విద్యార్థులపై నిషేధం విధించేందుకు ఆదేశాలు జారీ చేశారు. హాంకాంగ్‌కు కల్పించిన ప్రత్యేక వెసలుబాట్లను రద్దు చేయాలని తన పాలనా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. హాంకాంగ్‌పై చైనా చట్టాన్ని అమెరికాతో పాటుగా బ్రిటన్‌, జపాన్‌ కూడా తీవ్రంగా ఖండించాయి. చైనా నిర్ణయంపై పునరాలోచన చేయాలని.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా ఈ అంశంపై చర్చ జరగాల్సి ఆవశ్యకత ఉందన్నాయి.

tags : trump

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info