A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
9504 కరోనా పరీక్షలు- 131 పాజిటివ్
Share |
July 9 2020, 4:43 am

ఎపిలో 9504 కరోనా పరీక్షలు జరగ్గా, 131 కరోనా కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. వీటిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 61 ఉండగా.. రాష్ట్రంలో 70 పాజిటివ్ కేసులు ఉన్నాయని ఆ బులెటిన్ లో తెలిపారు. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,461కి కేసులు నమోదయ్యాయిఈ ఇరవై నాలుగు గంటలలో కరోనా కారణంగా ఎలాంటి మరణాలు జరగలేదు. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 2092 మంది డిశ్చార్జి అయ్యారు. 792 మంది చికిత్స పొందుతున్నారని బులెటిన్ లో తెలిపారు.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info