A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారు- జగన్ వ్యాఖ్య
Share |
July 9 2020, 3:31 am

జన్మభూమి కమిటీల మొదలు, రాజదాని భూముల వరకు అంతా తన కనుసన్నలలోనే జరగాలని గత ప్రభుత్వం లోని వారు భావిస్తే, తాము మాత్రం రాజకీయాలకు అతీతంగా పాలన సాగించామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాజదానిలో పేదలకు ప్రభుత్వ భూములు ఇవ్వాలని సంకల్పిస్తే కూడా వాటిని అడ్డుకునే ప్రయత్నం ప్రతిపక్షం చేసిందని ఆయన అన్నారు.ఎక్కడైనా పేదలకు భూములు ఇవ్వాలని ప్రతిపక్షాలు కోర్టుకు వెళతాయని, కాని ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుపడడానికి ప్రతిపక్షం కోర్టుకు వెళ్లిందని ఆయన అన్నారు.తాము చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఎలా అడ్డుకోవాలన్నదే ద్యేయంగా ప్రతిపక్షం పనిచేస్తోందని ఆయన అన్నారు.గతంలో రేషన్ కార్డుకు , బాత్ రూమ్ , ఇల్లు, ఏదైనా కానివ్వండి లంచం, సిఫారస్ లు లేనిదే పని జరిగేది కాదు..కాని ఇప్పుడు పైసా లంచం ఇవ్వకుండా, విమర్శలకు తావు లేకుండా బ్యాంక్ ఖాతాలో వేస్తున్నామని, ఇంటికే పంపుతున్నామని ఆయన అన్నారు.ప్రభుత్వ పధకం అయినా, కులం, ఆదాయం, డెత్ సర్టిపికెట్ లు ఏది కావాలన్నా గతంలో చెప్పులు అరిగేలా తిరిగేవారని, కాని ఇప్పుడు గ్రామంలోనే ఇంటి ఎదుటే 540 రకాల సేవలు అందిస్తున్నామని జగన్ అన్నారు.

tags : jagan,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info