A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిత్తశుద్దితో ఏడాది పాలన సాగింది- జగన్
Share |
July 9 2020, 3:30 am

ఈ ఏడాది పాలన నిజాయితీగా, చిత్తశుద్దితో,నిబద్దతో సాగిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఏడాదిపాలన పూర్తి అయిన సందర్భంగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంబించి మాట్లాడారు. 11 ఏళ్లక్రితం రాజకీయాలలోకి వచ్చానని ఆయన చెప్పారు. తాను 3800 కి.మీ. పాదయాత్ర చేసి అన్ని జిల్లాలు తిరిగానని అన్నారు. ఇలా సాగిన ఈ ప్రయాణం లో ప్రజల కష్టాలు, ఇబ్బందులు గమనించానని అన్నారు.అనేక మంది చదువులేకపోవడానికి ఆర్దిక సమస్యే కారణం. వైద్యం అందక అప్పులు పాలయ్యేవారిని చూశాను.కాన్సర్ వంటి జబ్బులు వస్తే,ఏ అవసరానికి సరిపడని విదంగా ప్రభుత్వ సాయం ఉండేది.ప్రభుత్వ ఆస్పత్రులు, చిత్తశుద్ది లేని రాజకీయ వ్యవస్థను చూశాం.రైతుల సమస్యలను చూశాం. ఇన పుట్ సబ్సిడీ లు కూడా ఇవ్వని పరిస్తితి ఉండేది. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఉత్పత్తులను పొలాల్లోనే వదలేసేవారు. ఎక్కడపడితే అక్కడ మద్యం అందుబాటులో ఉండేది. అక్క,చెల్లెమ్మల జీవితాలు ఎలా మార్చాలన్న ఆలోచన పాదయాత్రలో వచ్చేది..పేదరికం నుంచి కుటుంబాలు ఎలా బయటపడాలన్న ఆలోచనలు వచ్చేవి.అవన్ని చూసిన మీదటే, వీటన్నిటికి సమాదానంగా మానిఫెస్టోని తీసుకు వచ్చాం అని ఆయన అన్నారు. నాకు ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలని అనుకున్నా.కులాలు,మతాలు ,పార్టీలు చూడకూడదు.అని భావించానని ఆయన అన్నారు.మానిపెస్టోలని ఎట్టి పరిస్తితిలోను అమలు చేయగలిగితే ప్రజల జీవితాలు బాగుపడతాయని నమ్మాం అని ఆయన అన్నారు.

tags : jagan, rule

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info