A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
Share |
July 6 2020, 7:56 am

హిందూ పత్రికలో వచ్చిన ఈ వార్త ఆంద్రప్రభేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన సర్టిఫికెట్ అనుకోవాలి. ఎపలో ప్రవేశించిన ఏ వలస కార్మికులు ఇబ్బంది పడరాదని, వెంటనే వారిని బస్ ల ద్వారా, రైళ్ల ద్వారా వారి రాష్ట్రాలకు పంపించాలని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఆదేశాలను ఆసరాగా తీసుకుని కొందరు ఇతర రాష్ట్రాలలో ఉన్న కార్మికులు కూడా ఎలాగొలా ఎ పికి రావడం విశేషం. తమిళనాడులోని వేలూరు జిల్లాలో భవన నిర్మాణంలో ఉన్న సుమారు నలభై మంది కార్మికులు తమను ఒడిషా పంపించాలని అక్కడి ప్రభుత్వాన్ని ,జిల్లా అదికారులకు విజ్ఞప్తి చేశారు. కాని ఫలితం దక్కలేదు. దాంతో వారు ఎపిలో జరుగుతున్న విషయం తెలుసుకున్నారు. అక్కడ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు చేరుకుని జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు చేరుకున్నారు.వారు తమ గోడు విన్నవించుకున్నారు.దాంతో జిల్లా అదికారులు వారికి తాత్కాలిక ఆశ్రయం కల్పించారు.ఒడిషా కు వెళ్లే వలస కార్మికులతో కలిపి వీరిని కూడా పంపిస్తామని చెప్పారు.

tags : hindu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info