A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
Share |
July 6 2020, 8:25 am

కరోనా వైరస్ నేపద్యంలో లాక్ డౌన్ అనేక కుటుంబాలలో సమస్యలు తెచ్చిపెట్టింది. పెళ్లిళ్లు ఆగిపోయాయి.కొందరు వీడియోల ద్వారా పెళ్లి చేసుకున్నారు. తాజాగా వచ్చిన ఒక కదనం ఆసక్తికరంగా ఉంది. పశ్చిమబెంగాల్ కు చెందిన ఓం ప్రకాశ్ అనే పెళ్లికొడుకు, కాజల్ అనే అసోం కు చెందిన పెళ్లికూతురు రెండు రాష్ట్రాల సరిహద్దులో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లి ఆరు నెలల క్రితం ఇరువైపుల పెద్దలు నిర్ణయించారు. అంతలో కరోనా సంక్షోభం వచ్చంది. పెళ్లి వాయిదా వేద్దామని అనుకున్నారు. కాని పండితులు వద్దన్నారు. ఇప్పుడు పెళ్లి జరగకపోతే పెళ్లి ఎప్పటికి జరగదని జ్యోతిష్కం చెప్పారు.దాంతో ఎలాగో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కాని పశ్చిమబెంగాల్ నుంచి ఎవరిని అసోంలోకి అనుమతించడం లేదు. దాంతో సరిహద్దులో ఒక ఎమ్మెల్యే, అలాగే జిల్లా కలెక్టర్,పోలీసు అదికారుల సహకారం తీసుకుని అసోం, బెంగాల్ సరిహద్దున సగోళ్ల చెక్ గేట్ వద్ద చేశారు. ఇందుకోసం పెళ్లికొడుకు వారు 175కి.మీ దూరం, పెళ్లి కూతురు వారు 55 కి.మీ ప్రయాణం చేసి సరిహద్దు కు చేరుకున్నారు. ఇరువైపుల నుంచి ఇరవై మంది మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తర్వాత బెంగాల్ లో వీరిద్దరిని క్వారంటైన్ కు పంపించారు.

tags : marriage

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info