A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
Share |
July 6 2020, 8:45 am

ఇది మంచి విషయమే.దేశంలో కరోనా బారినపడ్డవారు కోలుకుంటున్న సంఖ్య గణనీయంగా పెరగడం, మరణాల రేటు బాగా తగ్గడం జరుగుతోందన్న వార్త వచ్చింది.కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలిపింది. కోవిడ్‌-19 మరణాల రేటు 3.3 శాతం నుంచి 2.87 శాతానికి తగ్గిందని, అంతర్జాతీయంగా మరణాల రేటు 6.4 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. మహమ్మారి బారినపడి కోలుకునే వారిసంఖ్య 60,000 దాటడంతో రికవరీ రేటు 41.61 శాతానికి పెరిగిందని తెలిపారు.ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో రికవరీ రేటు సంతృప్తికరంగా ఉందని అన్నారు. ప్రతి లక్ష మందిలో కేవలం 10.7 కేసులే నమోదవుతున్నాయని చెప్పారు. కరోనా పాజిటివ్‌ కేసులు గత24 గంటల్లో అత్యధికంగా 7,000కు చేరువవడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,45,000 దాటింది.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info