A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
Share |
July 6 2020, 9:04 am

అన్ని మతాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం తమది అని బ్రాహ్మణ కార్పొరేషన్ , విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.తమ ప్రభుత్వంపై బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దుష్ప్రచారం చేస్తున్నారని , ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలను ముఖ్యమంత్రి జగన్ తీసుకుని మతపరమైన కార్యక్రమాలు లాక్ డౌన్ లో ఆగిపోయి ఇబ్బంది పడుతున్న అర్చకులు, పాస్టర్ లు, మౌల్వీలకు సాయం చేశారని ఆయన అన్నారు.కన్నా లక్ష్మీనారాయణ నూజివీడు వద్ద భూ కబ్జా కు పాల్పడ్డారని, త్వారలోనే బయటకు వస్తుందని ఆయన అన్నారు. కన్నా ఏసీలో కూర్చొని దీక్షలు చేస్తూ ప్రజలు తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో భూముల అమ్మకం నిర్ణయం చేస్తే దాన్ని మా సీఎం రద్దు చేశారు. ఎటువంటి వివక్ష లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే హిందూ మతం వ్యతిరేకం అంటూ మా పై దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, మీరు కలిసి చేసిన పాపానికి ప్రాయచ్చిత్తంగా మీరు దీక్షలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. అని ఆయన అన్నారు.

tags : malladi vishnu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info