A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
Share |
July 6 2020, 8:04 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టతతో స్పందించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రైతులకు సంబందించిన కార్యక్రమాలపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని ఆయన అన్నారు. కరువు ప్రాంతం రాయలసీమకు నీటిని సరఫరా చేస్తామంటే వివాదాస్పదం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో మనం కూడా 800 అడుగుల నుంచే 3 టీఎంసీలను తీసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నామని, రూ.27 వేల కోట్ల వ్యయంతో ఈ ఏడాదే టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఇరు రాష్ట్రాలు తమ వాటా ప్రకారమే నీటిని వాడుకుంటాయని, తద్వారా రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.

రాయలసీమ ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తున్నారని, పోతిరెడ్డిపాడుపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణతో సమానంగా శ్రీశైలం నుంచి నీరు తీసుకుంటామని, దీనివల్ల ఇద్దరికీ సమన్యాయం జరుగుతుందని, ఎవరికీ అన్యాయం జరగదని సీఎం స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మిగతా ప్యాకేజీలకు ఈ ఏడాదే టెండర్లు పిలుస్తామని తెలిపారు.

tags : jagan, rayalaseema

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info