A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
Share |
September 22 2020, 11:00 am

ఎపి హైకోర్టు జడ్జిలను కొందరు అసభ్యపదజాలంతో దూషిస్తూ పోస్టింగ్ లు పెట్టారన్న సమాచారం బాద కలిగిస్తుంది. మీడియాలో వచ్చిన కదనాలు చూస్తే జడ్జిల పట్ల కొంతమంది తీవ్ర పదజాలం వాడారు.అలాంటి వాటిని ఎవరూ సమర్ధించరాదు. తప్పనిసరిగా సభ్య సమాజం ఖండించాలి. మనకున్న వ్యవస్థలలో లోపాలు ఉన్నాయని భావిస్తే,వాటిని సరిచేసుకునే ప్రయత్నం జరగాలి తప్ప, వ్యవస్థ మీద, అందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్న వ్యక్తుల మీద అసభ్యకరంగానో, ఆవేశపూరితంగానో దాడి చేయరాదు. అదే సమయంలో ఇప్పుడు న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని కొందరు పౌరహక్కులపై,పౌర సమాజ స్వేచ్చపై దాడి చేసే అవకాశం ఉంటుంది.అలాంటివారికి న్యాయస్తానం వారు కూడా అవకాశం ఇవ్వరాదని విజ్ఞప్తి చేయాలి. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ప్రదాని మొదలు, ముఖ్యమంత్రులను బూతులు తిట్టడాన్ని తీవ్రంగా ఖండించాం. మద్యం తాగి రోడ్డుపై వీరంగం వేసిన తీరును నిరసించాం. అతనికి హక్కులకు భంగం కలిగితే చర్య తీసుకోవచ్చు. కాని అతను వాడిన బూతులు సమాజానికి మంచిది కాదు. అలాగే ఇప్పుడు జడ్జిలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు. అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని మా బోటి వాళ్లం చెప్పాలి. న్యాయస్థానాలు తమ ప్రతిష్ట మరింత పెంచుకునేలా వ్యవహరించాలని కోరుకోవడం తప్పు కాదు. కాని వారిని కచ్చితంగా గౌరవించాలి. వారిని గౌరవిస్తూనే, వారి నిర్ణయాలు,లేదా తీర్పులలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని మాట్లాడుకునే స్వేచ్చ రాజ్యాంగం పౌరులకు ప్రసాదించింది. దానిని అంతా గుర్తించాలని, ఎవరి పరిధులలో వారు సంయమనంగా ఉండాలని కోరుకుందాం.

tags : ap ,highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info