A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
Share |
July 6 2020, 8:51 am

ఎపి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరవై ఐదు రోజుల తర్వాత ఎపిలోకి వచ్చారని ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు. ఇంతకాలం హైదరాబాద్ లో కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంద్రభవన్ లో గడుపుతూ, జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంపై బురదచల్లుతూ కూర్చున్నారని ఆయన అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన జయంతి వేడుకలు ఎలా నిర్వహిస్తారు? మహానాడు పెద్దడ్రామా, ఎన్టీఆర్‌ ఆత్మ ఇప్పటికీ క్షోభిస్తోంది. విజయవాడలోని కరకట్టకు రోడ్‌ మార్గాన వచ్చిన చంద్రబాబు వైజాగ్‌ ఎందుకు రాలేదు. కళా వెంకట్రావు లేఖలు రాయడం కాదు, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. చంద్రబాబు మొదట పెట్టిన ఐదు సంతకాలకు దిక్కులేదు. చంద్రబాబు మొదట పెట్టిన రుణమాఫీకి డబ్బులు ఇ‍వ్వాలని టీడీపీ నేతలు అడుగుతున్నారు. బెల్ట్‌ షాపులు రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశాడు. జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే బెల్ట్‌ షాపులు రద్దు చేశారు. ఇంటికి వెళ్లక ముందే జగన్‌మోహన్‌ మొదటి సంతకాన్ని అమలు చేశారని ఆయన అన్నారు.

tags : gadikota

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info