A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
Share |
July 6 2020, 9:00 am

ఎపిలో ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్ పాలనను స్వాగతిస్తున్నారని మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు.రాష్ట్రంలోకొత్త పరిపాలనకు ఆయన శ్రీకారం చుట్టారని మంత్రి వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్‌ అమలు చేశారని , మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చుతున్నామని ఆయన అన్నారు. ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించామని మోపిదేవి చెప్పారు. ఈ సంవత్సర కాలంలో 46 వేల కోట్లు ఖర్చు చేసి 3 కోట్ల మంది లబ్దిదారులకు వివిధ పథకాలు అందించామని మోపిదేవి వివరించారు.ఏడాది పరిపాలనను ప్రజా పరిశీలనలో పెట్టిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదే అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పరిపాలనలో రాజకీయాలు ఉండవని సీఎం జగన్ ముందు నుంచి చెబుతున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్‌ అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలన చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి జగన్ చరిత్రలో నిలిచిపోయారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.

tags : mopidevi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info