A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
Share |
July 6 2020, 9:10 am

ఉప రాస్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు తన సొంత నియోజకవర్గమైన ఉదయగిరి సమస్యలపై దృష్టి పెట్టారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో తాగు,సాగు నీటి సమస్యలను అద్యయనం చేసి ,ఒక పరిష్కారం చూపాలని వెంకయ్య నాయుడు కోరారు.
సోమవారం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కార్యదర్శి శ్రీ యూపీ సింగ్, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ తో జరిగిన సమావేశంలో ఉదయగిరి ప్రజలు ఎదుర్కుంటున్న నీటి సమస్యలను ఉపరాష్ట్రపతి తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఉదయగిరి ప్రజలతో ఆయన మాట్లాడినప్పుడు స్థానికులు ఈ సమస్యలు తీర్చాలని వెంకయ్య ను కోరారు. కృష్ణానది నుంచైనా లేదా.. సోమశిల ప్రాజెక్టు నుంచైనా తమకు నీటిని ఇప్పించాలని వారు ఉపరాష్ట్రపతిని కోరారు.దీపిసౌ ఆయన కేంద్ర అదికారులతో మాట్లాడారు. ఉదయగిరికి నీటిని అందించేందుకు సాంకేతిక సంభావ్యత (టెక్నికల్ ఫీజిబిలిటీ), సవివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అంశాలపై చర్చించాలని అధికారులకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నీటి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనితీరును కూడా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు.
లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, వీలుచూసుకుని ఉదయగిరిలో పర్యటిస్తామని, అక్కడి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి.. సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని అధికారులు తెలిపారు.

tags : venkayya

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info