A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
Share |
July 6 2020, 9:30 am

తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధి మళ్లీ విస్తరిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే బాధితులకు సరైన వైద్యచికిత్స అందించాలని, వారిని ఆదుకోవాలని ఆయన ఆదేశించారు. తక్షణమే ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నానిని, అధికారులను బాధితులను పరామర్శించాలని ఆదేశించారు. అదేవిధంగా దీనిపై ఒక సమగ్రమైన ఆలోచన చేయాలని, మళ్లీ ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. వెంటనే వైద్య బృందాలను పంపి చికిత్స అందించాలని కూడా స్పష్టం చేశారు.

tags : cm,agencies

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info