A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
Share |
July 9 2020, 4:58 am

మన పాలనలో ఉన్న లోపాలను తెలుసుకోవడానిక తాను ప్రయత్నిస్తున్నానని అందుకే ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. పద్నాలుగు నెలలపాటు 3800 కిలోమీటర్ల దూరం తన పాదయాత్ర సాగిందని ఆయన అన్నారు. ఆ సమయంలో ప్రజలతోనే మమేకం అయ్యాయని, ప్రజలు పడుతున్న బాదలను గమనించి ,వాటిని ఎలా పరిష్కరించాలన్న ఆలోచనలు వచ్చాయని ఆయన అన్నారు. ఆ క్రమంలోనే ఒక వ్యవస్థ రావాలని, అది పారదర్శకంగా, ప్రజలకు అందుబాటులో ఉంటేనే పేదలకు,ప్రజలకు తోడుగా ఉంటామని భావించామని ఆయన అన్నారు. ఆ ఆలోచనల నుంచి వచ్చినవే గ్రామ సచివాలయం, వలంటీర్ల వ్యవస్థలని జగన్ వివరించారు.ఈ వ్యవస్తలలో అవినీతి లేకుండా ఉండాలంటే, పారదర్శకంగా ఉండాలంటే గత ఎన్నికలలో తనకు ఓటు వేయాని వారికి కూడా ప్రభుత్వ స్కీములు అందాలని స్పష్టం చేశనని ఆయన అన్నారు. గతంలో ఎన్నడూ లేని విదంగా లబ్ది దారుల జాబితాలను గ్రామ సచివాలయాలలో ప్రదర్శిస్తున్నామని ఆయన అన్నారు.ఆ జాబితాలో పేరు లేకపోతే ఎలా దరఖాస్తు చేసుకోవాలో, అక్కడే వేరే బోర్డుపై వివరించామని ఆయన అన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info