A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి, బిజెపి నేతలపై సుబ్రహ్మణ్యస్వామి ఫైర్
Share |
July 9 2020, 2:57 am

టిటిడి ఆస్తుల విషయంలో టిడిపి, బిజెపి నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి ,బిజెపి ఎమ్.పి సుభ్రహ్మణ్య స్వామి అన్నారు. టిడిపి,బిజెపి నేతలు అబద్దాలు చెబుతున్నారని ఆయన అన్నారు. టిటిడి ఆస్తుల విషయంలో గత టిడిపి ప్రభుత్వం టైమ్ లోనే బోర్డు ఆస్తుల విక్రయానికి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేయడాన్ని అబినందిస్తున్నానని ఆయన అన్నారు.బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి టిటిడి సభ్యుడు గా ఉన్నప్పుడే అమ్మకానికి ప్రయత్నం జరిగిందని ఆయన అన్నారు. చంద్రబాబు అన్నీ అసత్యాలు చెబుతారని, ఆయన ప్రజా విశ్వాసం కోల్పోయారని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. బిజెపి నేతలు ఉత్తరాఖండ్ లో ఏమి జరుగుతోందో తెలుసుకోవాలని, అక్కడ ఆలయాలన్నిటిని ప్రభుత్వం స్వాదీనం చేసుకుందని , ఆవిషయాన్ని ముందుగా బిజెపి నేతలు గమనించాలని ఆయన అన్నారు.

tags : subrahmanyaswamy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info