A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లాక్ డౌన్ పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
Share |
July 9 2020, 2:59 am

లాక్ డౌన్ పై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శించారు. లాక్ డౌన్ లో కేంద్రం విఫలం అయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పి కొట్టారు. యావత్‌ దేశం ప్రాణాంతక వైరస్‌తో పోరాడుతుంటే కాంగ్రెస్‌ నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని జవదేకర్ అన్నారు. సరైన సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారని ప్రపంచ దేశాలు మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకున్నాయని ఆయన అన్నారు. కరోనా తొలినాళ్లలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో మూడు రోజులుగా ఉన్న కేసుల డబ్లింగ్‌ రేటు.. 13 రోజులకు పెరిగిందని , ఇది భారత్‌ విజయమని అన్నారు. గతంలో లాక్ డౌన్ ను కాంగ్రెస్ వ్యతిరేకించిందని,ఆర్దిక సంక్షోభం వస్తుందని చెప్పిందని, ఇప్పుడు సడలింపులు ఇస్తే ఆ నిర్ణయం సరికాదని అంటోందని, ఇది కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అని మంత్రి ఎద్దేవ చేశారు.

tags : prakash javadekar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info