A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ కరోనా పరీక్షలు-హైకోర్టు అసంతృప్తి
Share |
July 9 2020, 3:06 am

తెలంగాణాలో కరోనా పరీక్షలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.ఇంతవరకు జరిగిన కరోనా పరీక్షల వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.కరోనా పరీక్షలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసింది.మృత దేహాలకు కరోనా పరీక్షలు అక్కర్లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.ఆస్పత్రులలో మరణించిన వారి మృతదేహాలకూ కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లక్షణాలు లేనప్పటికీ హైరిస్క్ అవకాశాలున్న వారికీ కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో చాలా తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించిందని వార్తలు సూచిస్తున్నాయి. కరోనా పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసిన లేఖలను కూడా సమర్పించాలని కోరింది. జూన్ నాలుగో లోగా వివరాలు తెలపాలని కోరింది.

tags : telangangana ,highcourt,carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info