A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కన్నా భూ దందా త్వరలోనే బయటపెడతాం-మంత్రి
Share |
July 9 2020, 3:04 am

బిజెపి ఎపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గతంలో చేసిన భూమి కబ్జాలను త్వరలోనే బయటపెడతామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. గతంలో టిటిడి పాలకమండలి చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ జిఓ ఇచ్చిన తర్వాత కూడా కన్నా నిరాహారదీక్ష చేయడం దురుద్దేశపూరితమని విమర్శించారు. ఆయన ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని అన్నారు.తిరుమల ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ నూజివీడులో వెంకటాచల స్వామి ఆలయ భూములు 18 ఎకరాలు కబ్జా గురించి కొద్దీ రోజుల్లో బయట పెడతాం అని మంత్రి హెచ్చరించారు. మా ప్రభుత్వాన్ని కించపరచాలని చూస్తే ఊరుకునేది లేదు.’ అని వెల్లంపల్లి అన్నారు.

tags : vellampalli

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info