A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
Share |
July 9 2020, 4:18 am

చాలా రోజుల తర్వాత ఎపి ముఖ్యమంత్రి జగన్ తనకు వ్యతిరేకిస్తున్న మీడియా గురించి ప్రస్తావించారు. మన పాలన-మీ సూచనలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనం పోరాడుతున్న చంద్రబాబుమీదే కాదు..ఈనాడు, ఎబిఎన్.టివి 5 వంటి చానళ్లు మీడియాపై కూడా పోరాడవలసి వస్తోందని ఆయన అన్నారు.రాయలసీమ ఎత్తిపోతల తదితర నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ మీడియా కావాలని దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు.శ్రీశైలం లోకి వరద వస్తున్నప్పుడు 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే తెలంగాణ ప్రాజెక్టులకు నీటిని లిప్ట్ ద్వారా తీసుకుంటున్నారని, అదే న్యాయం ఎపికి కూడా ఉండాలని , అందుకే రాయలసీమ లిప్ట్ ద్వారా నీటిని తీసుకోవాలని ప్రతిపాదించామని ఆయన అన్నారు.854 అడుగుల మట్టం వస్తేనే రాయలసీమకు నీరు పోతిరెడ్డిపాడు వద్ద నీటిని డ్రా చేసుకోగలమని, ఆ పరిస్థితి కాకుండా ఎవరికి నష్టం లేకుండా,ఎవరికి కష్టం లేకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని జగన్ అన్నారు.

tags : jagan, fight

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info