A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
Share |
July 9 2020, 3:12 am

మహానాడు జరుపుకోబోతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు టిడిపికి గుడ్ బై చెప్పి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారని ఒక న్యూస్ చానల్ కదనాన్ని ఇచ్చింది. సాయంత్రం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి జగన్ ను కలవవచ్చని చెబుతున్నారు. కొంతకాలం క్రితం వరకు టిడిపికి గట్టి మద్దతుదారు అన్న భావన ఉన్న ఏలూరి సాంబశివరావు టిడిపికి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలోకి రావడం ఆసక్తికరమైన పరిణామమే.ఇప్పటికే ఆ జిల్లాలో చీరాల టిడిపి ఎమ్ఎల్యే కరణం బలరాం పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

tags : eluri

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info