A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
Share |
July 6 2020, 7:05 am

భారతీయ జనతా పార్టీ ఎపిలో దారుణమైన రాజకీయాలకు ఒడిగడుతున్నట్లుగా ఉంది. ప్రజలలో మత విద్వేషం పెంచడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. బిజెపి ఆద్వర్యంలో హిందూ ఆలయాలు, ఆస్తుల పరిరక్షణ పేరుతో దీక్షల తంతు సాగించారు. బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు గుంటూరులో దీక్షలు చేస్తే, డిల్లీలో జివిఎల్ ప్రబృతులు దీక్ష చేశారని వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ టిటిడి టిటిడి ఆస్తులపై ప్రభుత్వం ఇచ్చిన జిఓ కూడా మోసపూరితంగా ఉందని ఆరోపించారు.2015లో టిటిడి చేసిన తీర్మానాన్ని మాత్రమే రద్దు చేశారని ఆయన అన్నారు.
హిందూ దేవాలయాలు, భూముల జోలికి వస్తే ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అండతో మత మార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మంగళగిరి, అన్నవరం ఆలయ భూములు తీసుకునే ప్రయత్నం చేశారని, భాజపా ఆందోళనతో వెనక్కి తగ్గారన్నారుజగన్ అధికారంలోకి వచ్చాక చేసిన ప్రతి పని ప్రజలను మోసం చేసేదేనని ఆయన అన్నారు.

ఎపి ప్రజలు ఇలాంటి మత విద్వేష రాజకీయాలను అంగీకరిస్తారా?

tags : kanna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info